జ‌ల‌మండ‌లి ఉద్యోగుల తిరంగా బైక్‌ ర్యాలీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్సవాల్లో భాగంగా ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి కార్యాల‌యం వ‌ద్ద జ‌ల‌మండ‌లి ఎండి దానం కిషోర్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించారు.రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు జ‌ల‌మండ‌లి ఉద్యోగులు బుధ‌వారం భారీ ఎత్తున‌ తిరంగా బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీ ఖైర‌తాబాద్‌, ఎన్టీఆర్ మార్గ్‌, ట్యాంక్ బండ్‌, నెక్లేస్ రోడ్డు మీదుగా సాగింది. వెయ్యి మందికి పైగా జ‌ల‌మండ‌లి ఉద్యోగులు మువ్వ‌న్నెల జెండాలు చేత‌బ‌ట్టి భార‌త్ మాతాకి జై, వందేమాత‌రం నినాదాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మ‌హిళా ఉద్యోగినులు సైతం బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ల‌య‌న్స్ క్ల‌బ్ స‌హ‌కారంతో జ‌ల‌మండ‌లి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరంలో జ‌ల‌మండ‌లి ఉద్యోగులు వంద మందికి పైగా పాల్గొని ర‌క్త‌దానం చేశారు. వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను ఎండి అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.