Hyderabad: ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’..

హైదరాబాద్ (CLiC2NEWS): మన దేశ సైనికులకు సంఘీభావంగా నగరంలోని ట్యాంక్‌బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం నుండి సచివాలయం జంక్షన్ మీదుగా సైనికి ట్యాంక్ వరకు కొనసాగింది. తిరంగా ర్యాలీలో మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజి గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ అమలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని మన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు.