రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు.. సిఎం కెసిఆర్

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజల జన జీవనం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు జులై 28 వ తేదీన కూడా సెలవును ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, భారీ వరదలపై సమీక్ష నిర్వహించిన విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26, 27న సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం మెహర్రం సెలవు రోజు కావడంతో విద్యాసంస్థలు అన్నీ సోమవారం నుండి తెరుచుకోనున్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారలును సిఎం ఆదేశించారు.