హైదరాబాద్‌లో భారీ వర్షం.. పిడుగు పాటుకు కాలిపోయిన టివిలు, ఫ్రిజ్‌లు
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/rain-in-hyd-2.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురింసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని వాసుదేవరెడ్డ నగర్ కాలనీలో ఓ నాలుగంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. ఈ భారీ శబ్ధానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ పిడుగు కారణంగా అపార్ట్ మెంట్‌లోని టివిలు, ఫ్రిజ్‌లు, లిఫ్ట్‌లు కాలిపోయినట్లు సమాచారం.