హైడ్రా: ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు ఉపక్రమించింది. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదనే అభియోగాలున్నాయి. వీటిని పరిశీలించిన రంగనాధ్.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. వాటికి అనుమతులిచ్చిన
అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. జిహెచ్ ఎంసి చందానగర్ డిప్యూటి కమిషనర్‌తో పాటు హెచ్ ఎండియే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్‌పై కేసు నమోదు చేయాలని సూచించింది.