సోషల్ మీడియాలోకి హైడ్రా..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించడం, చెరువులను రక్షించడం ప్రధానోద్దేశంగా ఏర్పాటైన హైడ్రా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లోకి అడుగుపెట్టింది. హైడ్రాపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోకి అడుగిడింది. ఎన్ని అడ్డంకులు వచ్చిన హైడ్రా తనపని తాను చేసుకుపోతుంది. ‘కమిషనర్ హైడ్రా’ పేరుతో ఖాతాను ప్రారంభించింది. గతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EVDM)ఖాతానే హైడ్రాగా మార్చినట్లు సమాచారం.
ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నామన్న సిపిఐ నారాయణ