నేను బ‌తికే ఉన్నా.. పూన‌మ్ పాండే

బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే మ‌ర‌ణించ‌న‌ట్లు శుక్ర‌వారం న్యూస్ వైర‌ల్ అయిన విష‌యం తెలిసందే. తాజాగా పూన‌మ్‌.. తాను బ‌తికే ఉన్నానంటూ ఎక్స్ పేజిలో పోస్ట్ పెట్టింది. త‌న మ‌ర‌ణ వార్త విష‌యంలో అంద‌రూ క్ష‌మించాల‌ని కోరింది. పూన‌మ్ గార్భాశయ క్యాన్స‌ర్‌తో మృతి చెందిన‌ట్లు నిన్న వార్త‌లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అభిమానులు ఎంతో విచారం వ్య‌క్తం చేశారు. కానీ తాజాగా శనివారం తాను ఎలాంటి క్యాన్స‌ర్‌తోనూ ఇబ్బంది ప‌డ‌టంలేద‌ని.. మ‌మిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలని కోరింది. అంద‌రూ  HPV వ్యాక్సిన్ ముంద‌స్తుగా తీసుకుంటే దీనిని ఎద‌ర్కోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ వ్యాధితో ఎవ‌రూ కూడా ప్రాణాలు కోల్పోకూడ‌ద‌ని.. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసేలా చేయ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశ్య‌మ‌ని ఆమె తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.