ఐఎఎంసి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం మనకు గర్వకారణం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఐఎఎంసి ఏర్పాటు కావటం గర్వ కారణమని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. నానక్ రామ్‌గూడో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సిఎం కెసిఆర్ కలిపి ప్రారంభించారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా (IAMC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయటం, జస్టిస్ ఎన్వి రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చేతులు జోడించి నమస్కరించి, మనస్ఫూర్తిగా భినందిస్తున్నాని కెసిఆర్ పేర్కొన్నారు.