సంతానం కావాలి..నా భర్తకు పెరోల్ మంజూరు చేయండి.. ఓ మహిల అభ్యర్థన
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/prision_woman.jpg)
భోపాల్ (CLiC2NEWS): మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఓ అరుదైన విషయం చోటుచేసుకుంది. జైలు అధికారులకు ఓ మహిళ ఈ అరుదైన అభ్యర్థన చేయడం విశేషం. అసలు విషయానికి వస్తే ఆ మహిళకు సంతానం కావాలని.. దాని కోసం గ్వాలియర్ సెంట్రల్ జైల్లో జీవతకాలం శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ మీద విడుదల చేయాలని ఆ మహిళ దరఖాస్తు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా శివ్‌పురి ఏరియాకు చెందిన దారా సింగ్ జాతవ్ అనే వ్యక్తి కి 7 సంవత్సరాల కిందట ఓ మహిళతో పెళ్లయింది. ఈ క్రమంలో వివాహమైన కొంత కాలనికే తన భర్త ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో కోర్టులో దోషిగా నిరూపణ కావడంతో అతనికి సదరు కోర్టు జీవిత కాలం శిక్షను విధించింది.
ఈ క్రమంలో ఆ ఖైదీ భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఇటీవల జైలు అధికారులకు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులో “తనకు పిల్లలు కావాలని.. దానికి తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలి“ అని అధికారులకు భార్య దరఖాస్తులో అభ్యర్థించింది.
ఆ దరఖాస్తుపై జైలు సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. సదరు మహళ దరఖాస్తును సంబంధిత అధికారులకు పంపినట్లు తెలిపారు. అక్కడి జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి కనీసం రెండేళ్ల పాటు శిక్షణ పూర్తయ్యాక.. సదరు ఖైదీ సత్ర్పవర్తన ఆధారంగా పెరోల్ పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుపై సంబంధిత జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి అరుదైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అక్కడ కూడా ఇలాంటి అభ్యర్థనతోనే ఒక మహిల కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు అనుకూలంగా అరుదైన తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.
సంతానం పొందేందుకు తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన జోధ్‌పుర్ కోర్టు సంబంధిత ఖైదీకి 15 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది.
It additionally presents Jakob (John Cena), Dom’s brother in action along with his household,
and we see Brie Larson’s new character is on our heroes’ facet.