ఐఎఎంసి ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంది: సిజెఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త్‌లోనే తొలి ఐఎఎంసి హైద‌రాబాద్‌లో ఏర్పాట‌యింది. నాన‌క్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే ట‌వ‌ర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (ఐఎఎంసి)ను సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యామ‌యూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో క‌లిసి ప్రారంభించారు. అనంత‌రం ఈ కార్య‌క్ర‌మంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌సంగించారు.
ఆర్బిట్రేష‌న్‌, మీడియేష‌న్ కేంద్రం హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. ఐఎఎంసి ఏర్పాటుకు ప్ర‌తిపాదించ‌గానే కెసిఆర్ వెంటనే అంగీక‌రించారని తెలిపారు. త‌క్కువ స‌మ‌యంలో మంచి వ‌స‌తుల‌తో ఐఎఎంసి ఏర్పాటైంది.. మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన ప్ర‌భుత్వానికి సిజెఐ ద‌న్య‌వాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.