తెలంగాణ, ఎపి నుండి రిలీవ్ అయిన ఐఎఎస్ అధికారులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ నుండి ఎపికి వెళ్లాల్సిన అధికారులు డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ.. క్యాట్, హైకోర్టులోను వారికి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి ఎపికి వెళ్లాల్సిన వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ నుండి రిలీవ్ అయ్యారు. అదేవిధంగా ఎపి నుండి ఐఎఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ .. తెలంగాణ సిఎస్ శాంతి కుమారికి రిపోర్టు చేశారు.
డిఒపిటి ఉత్తర్వులపై ఐఎఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తాం.. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎవరు ఎక్కడ పనిచేయాలన్నది కేంద్రం నిర్ణయిస్తుంది. మరోసారి పరిశీలించమని డిఒపిటిని ఆదేశించమంటారా అని ప్రశ్నించింది.
రిలీవ్ చేసేందుకు 15 రోజులు గడువు ఇవ్వలని రెండు రాష్ట్రాల డిఒపిటిని కోరాయని ఐఎఎస్ ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత పదేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని వాదనలు వినిపించారు. ట్రైబ్యునల్‌లో నవంబర్ 4న విచారణ ఉందని.. తుది తీర్పు వరకు రిలీవ్ చేయవద్దని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం.. ఐఎఎస్ అధికారుల పిటిషన్‌లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పునర్విభజన చట్టం ప్రకారం ఐఎఎస్ అధికారులను కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డిపార్ట్ మెంట్ ఆండ్ ట్రైనింగ్ విభాగం (డిఒపిటి) ఆదేశించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని తాము కొనసాగుతున్న రాష్ట్రంలోనే ఉండే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణలో కొనసాగుతున్న ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, కరుణ, వాణి ప్రసాద్ .. అదేవిధంగా ఎపినుండి సృజన క్యాట్‌ను ఆశ్రయించారు.
క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఎస్ అధికారులకు చుక్కెదురు
డిఒపిటి ఉత్తర్వులు రద్దు చేయాలని క్యాట్‌లో ఐఎఎస్‌ల పిటిషన్లు