క్రికెటర్ సిరాజ్‌పై ఐసిసి చర్యలు.. 15% జరిమానా
Mohammed Siraj: భారత పైసర్ మహ్మద్ సిరాజ్‌పై ఐసిసి చర్యలు తీసుకుంది. లార్డ్స్ టెస్టులో బ్యాటర్ ఔటై వెళుతున్నపుడు దూకుడుగా వ్యవహరించినందుకు అతడి ఖాతాలో డీ మెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. అభ్యంతరకరంగా ప్రవర్తించడం, భాషను వినియోగించడం, దూకుడుగా వ్యవహరించడం అపరాధం. బెన్ డకెట్ ఔటూ వెళుతున్న క్రమంలో సిరాజ్ దూకుడుగా వ్యవహరించాడు. దీంతో అతనికి 15% జరిమానా తో పాటు డి మెరిట్ పాయింట్‌ను విధించింది. రెండు సంవత్సరాలలో వ్యవధిలో సిరాజ్‌కు రెండో డీ పాయింట్ పడింది. రెండు సంవత్సరాల్లో ఆటగాడి ఖాతాలో 4 అంతకంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లు ఉంటే అవి సస్పెన్షన్ పాయింట్లగా మారతాయి. మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.