సింధుకు ఐస్‌క్రీం.. నీరజ్ చోప్రాకు చుర్మా.. తినిపించిన మోడీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎలింపిక్స్‌లో పతకాలు సాధించిన, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. అనుకున్నట్లుగా ఆయన
హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రాకు చుర్మా తినిపించారు.
సోమవారం ప్రధాని మోడీ టోక్యో ఒలింపిక్స్ మహాక్రీడలకు వెళ్లిన బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసంలో అథ్లెట్లకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో మోదీ చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఇవాళ మోదీ తన మాట నిలబెట్టుకున్నారు.
జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతోనూ మోడీ ఫోటో దిగారు. అనంతరం వారిద్దరూ పర్సనల్‌గా కాసేపు గడిపారు. తినకు చూర్మ వంటకం ఇష్టమని నీరజ్ చెప్పారు. ఆ డిష్‌ను ఈ కార్యక్రమం కోసం మోడీ చేయించారు. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధుతోనూ మోడీ కాసేపు ముచ్చటించారు.