భార‌త్‌లో ముగ్గురికి హెచ్ఎంపివి వైర‌స్‌ పాజిటివ్

ఢిల్లీ (CLiC2NEWS): చైనాలో వెలుగు చూసిన హ్యామ‌న్ మెటానిమో వైర‌స్ (హెచ్ఎంపివి) .. భార‌త్‌లో ముగ్గురికి వైర‌స్ పాజిటివ్‌గా గుర్తించారు. చైనాలో హెచ్ఎంపివి విజృంభిస్తున్న త‌రుణంలో భార‌త‌ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సంగ‌తి తెలిసిందే. వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కూడా కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో తాజాగా దేశంలో మూడు హెచ్ఎంపివి పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌ర్ణాట‌క‌లో రెండు, గుజ‌రాత్‌లోలో ఓ కేసు న‌మోదైంది. బెంగ‌ళూరులో 3, 8 నెల‌లు వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు, అహ్మ‌దాబాద్‌లో ఓ చిన్నారికి వైర‌స్ సోకిన‌ట్లు ఐసిఎంఆర్ వెల్ల‌డించింది.

హెచ్ఎంపివి వైర‌స్ ల‌క్ష‌ణాలు సాధార‌ణ ప్లూ, ఇత‌ర శ్వాస కోశ ఇన్ఫెక్ష‌న్ మాదిరిగానే ఉంటాయ‌ని వైద్యులు తెలుపుతున్నారు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువైతే కొంద‌రిలో బ్రాంకైటిస్ , నిమోనియాకు దారితీయోచ్చ‌ని వెల్ల‌డించారు. భార‌త్‌లో హెచ్ఎంపివి వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన కుటుంబాలు ఇటీవ‌ల ఎటువంటి ప్ర‌యాణాలు చేయ‌లేదు.. వైర‌స్ వెలుగు చూసిన దేశాల్లో వీరు ప‌ర్య‌టించ‌లేదు. బెంగ‌ళూరులో వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ మూడు నెల‌ల చిన్నారి కోలుకొని ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జి కాగా.. మ‌రో చిన్నారి చికిత్స పొందుతోంది. అహ్మ‌దాబాద్‌లోని చిన్నారికి చికిత్సనందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.