ICSE: ఐసిఎస్ఇ టెన్త్ ఫలితాలు విడుదల..

ఢిల్లీ (CLiC2NEWS): పదో తరగతి విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సిఐఎస్‌సిఇ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తంగా 99.97% ఉత్తీర్ణత నమోదైంది. నలుగురు విద్యార్థులు 99.8% స్కోర్ సాధించి టాప్ ర్యాంక్ సాధించారాని సిఐఎస్‌సిఇ వెల్లడించింది. పుణెకు చెందిన హర్‌గుణ్ కౌర్ మథరు, కాన్పూర్‌కు చెందిన అనికా గుప్పతా, బలరాంపూర్‌కు చెందిన పుష్కర్ త్రిపాఠి, లఖ్కవూకు చెందిన కనిష్క మిత్తల్ ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలను cisce.org వెబ్సైట్లో యూనిక్ ఐడీ, ఇండెక్స్ నంబర్‌తో పాటు అక్కడ కనిపించే captcha ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ICSE Unique Id> ఎంటర్ చేసి 09248082883 నంబర్‌కు ఎస్ ఎంఎస్ చేసి కూడా రిజల్ట్ తెలుసుకోవచ్చని తెలియజేశారు.