ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి.. వైఎస్ జగన్

అమరావతి (CLiC2NEWS): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్‌కు లేఖ రాశారు. తమను అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని , విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్‌సిపి పార్టికి కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు.
ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్బంగా ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం జగన్ ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 % సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంట్‌లో , ఉమ్మడి ఎపిలోను ఈ నిబంధన పాటించలేదని గుర్తుచేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు.
1984 లోక్‌సభకు టిడిపి నుండి 30 మంది ఎంపీలు సీట్లు గెలుచుకోగా.. సభలో 10% సీట్లు లేకపోయినా టిడిపికి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 294 సీట్లకు కాంగ్రెస్ 26 సీట్లు సాధించింది. 10% సీట్లు రాకపోయినా పి. జనార్ధన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ లో 70 స్థానాలకు గాను బిజెపి కేవలం 3 సీట్లు సాధించింది. అయినా ఆ పార్టికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశ్యంతోనే లేఖ రాస్తున్నట్లు .. ప్రతిపక్ష పార్టీగా సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్దమైన భాగస్వామ్మం లభిస్తుందని, ఈ అంశాలను పరిశీలించాలని కోరుఉతన్నట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు.