ఫిబ్రవరి 5న శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ
వచ్చేనెల 2 నుండి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఫిబ్రవిరి 5వ తేదీన దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుంది. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2 వతేదీనుండి 14 వ తేదీ వరకు విగ్రహావిష్కరణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడి హాజరుకానున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరుకానున్నారు.