గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు ఇవ్వండి షాయాజి షిండే!

హైదరాబాద్ (CLiC2NEWS): సినీనటుడు షాయజి షిండే గురించి తెలియని వారుండరు. బిగ్‌బాస్ సీజన్-8కు వచ్చిన ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నాని చెప్పారు. ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇస్తే.. తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని అన్నారు.
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’ . ఈ చిత్రంలో షాయాజి షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా సుధీర్, షాయజి ‘బిగ్‌బాస్ సీజన్-8’లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా షాయజి మాట్లాడుతూ.. “మా అమ్మగారు 97లో కన్నుమూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగానని, అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ , నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను అని బాధపడి, వెంటనే మరొక విషయం చెప్పానన్నారు. అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకొని, ఇండియా మొత్తం నాటుతానని చెప్పారు. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను,పూలను, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినపుడల్లా అమ్మ గుర్తు వస్తుంది.. అమ్మ తర్వాత భూ మాత కూడా అంతే గుర్తొస్తుంది”. సాధారణంగా గుడిలో ప్రసాదాలు పంచి పెడతారు.. దీంతోపాటు భక్తులకు ఒక మెక్కను కూడా ఇస్తే బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితో అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో ఈ విధానం ప్రారంభించానని తెలిపారు.
ఆయన ఆలోచనకు నాగార్జున మెచ్చుకొని, పవన్‌కల్యాణ్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.. వారే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు.
[…] గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు ఇవ్వ… […]