కొవిడ్ పాజిటివ్ వస్తే.. ఏడు రోజులు వేతనంతో కూడిన సెలవులు..
యూపి సర్కార్ కీలక నిర్ణయం
లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచన 24 గంటల్లో 8,334 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరాష్ట్ర ప్రభుత్వ అనేక చర్యలు ప్రారంభించింది. ఈమేరకు సిఎం యోగీ ఆదిత్యనాథ్ పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలలో అత్యవసర సేవల విభాగాలు మినహా ఉద్యోగులు 50% హాజరు కావాలి. వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కార్యాలయాలలో పనిచేసేవారికి కొవిడ్ పాజిటివ్‌గా తేలితే వారికి ఏడు రోజులపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సిఎం ఆదేశించారు.