ఈ ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ పోటీచేయను: ట్రంప్

వాషింగ్టన్ (CLiC2NEWS): ఈ ఏడాది నవంబర్లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టి అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబంర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ 2028లో పోటీచేయనన్నారు. ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ వెల్లడించారు. విస్తృత స్థాయిలో మోసం జరిగితే తప్ప ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయే ప్రసక్తే లేదన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ట్రంప్.. చీటింగ్ ఆరోపణలు చేసినట్లు సమాచారం.