ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!
ఢిల్లీ (CLiC2NEWS): సైన్యంలో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకునేవారు గతంలో నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎన్నడూ పాల్గొనలేదనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుందని త్రివిధ దళాలకు చెందిన అధికారులువెల్లడించారు. దీనికి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ ఎఫ్ ఐఆర్ నమోదైనట్లు పోలీస్ వెరిఫికేషన్‌లో తేలితే అటువంటి వారికి అగ్నివీరులుగా ప్రవేశం పొందేందుకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకం 1989 నుంచి పెండింగ్‌లో ఉందని.. ఎట్టిపరిస్థితుల్లో దీనిపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెప్టినెంట్ జనరల్ అనిల్ పూరీ మాట్లాడుతూ.. క్రమశిక్షణే భారత సైన్యానికి పునాది, అటువంటి సైన్యంలో దాడులు, దహనాల వంటి క్రమశిక్షణారాహిత్యానికి చోటులేదు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనలేదని ప్రతి అభ్యర్థి ప్రమాణపత్రం సమర్పించాలి. పోలీస్ వెఫికేషన్లో ఏ అభ్యర్థి మీదైనా ఎటువంటి ఎఫ్ ఐఆర్ నమోదైనట్లు తేలినా అగ్నివీరులుగా వారికి ప్రవేశం లేదు. అని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
అగ్నిపథ్: రెండేళ్ల సుదీర్ఘ అధ్యయనం తర్వాతే నిర్ణయం