నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా: గెల్లు శ్రీనివాస్ యాదవ్​

హైద‌రాబాద్ (CLiC2NEWS):  హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాదవ్​కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించే బాధ్యతను కేసీఆర్ మంత్రి హరీశ్​రావుకు అప్పగించినట్లు చెప్పారు.​ కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంటలో నిర్వహించిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. హుజూరాబాద్​ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటానని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు పాదాభివందనాలు తెలియజేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. మీకోసం ఓ పని మనిషిలా పని చేస్తా.. నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదువుకునే రోజుల నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను. కేసీఆర్​ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటాను అని గెల్లు శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో టిఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

 

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్

Leave A Reply

Your email address will not be published.