ఉత్త‌మ విద్యాసంస్థ‌గా ఐఐటి మ‌ద్రాస్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS):  భార‌త్‌లో ఉత్త‌మ విద్యా సంస్థ‌గా ఐఐటి మ‌ద్రాస్ వ‌రుస‌గా ఐదోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే ఉత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగ‌ళూరు నం.1 లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్ వ‌ర్క్ కింద రూపొందించిన జాబితాను సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ ర్యాంకుల‌ను కేంద్రం 2016 నుంచి ప్ర‌క‌టిస్తోంది.

ఈ సంవ‌త్స‌రం ప్ర‌క‌టించిన విద్యాసంస్థ‌ల జాబితాలో …

నం. 1 ర్యాంకు: ఐఐటి మద్రాస్
నం. 2 ర్యాంకు: ఐఎస్‌సీ బెంగ‌ళూరు
నం. 3 ర్యాంకు: ఐఐటి డిల్లీ

అలాగే విశ్వ‌విద్యాల‌యాల ప‌రంగా..
నం. 1 ర్యాంకు: ఐఐఎస్‌సి బెంగ‌ళూరు
నం. 2 ర్యాంకు: ఢిల్లీలోని జెఎస్‌యు
నం. 3 ర్యాంకు: జామియా మిలియా ఇస్లామియా

ఈ జాబితాలో హైద‌రాబాద్‌లోని హెసియు ప‌దో స్థానంలో నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.