మరో వారం పాటు ఎండలు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/sun-heat-scale-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో.. ప్రజలు ఇండ్ల నుండి బయటికి రావాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు కంటే ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేసింది. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టిఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.