మిచౌంగ్ తుపాను.. నీట మునిగిన పంటపొలాలు

అమరావతి (CLiC2NEWS): మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. దీంతో గంటకు 90-100 కిలోమీటరల్ వేగంతో బలమైన ఈదరు గాలులు వీస్తున్నాయి. రానున్న ఆరు గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుముల పంటలు పూర్తిగా నీటమునిగాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరిందీ. దీంతో అక్కడున్న రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
రాయలసీమ జిల్లాల్లోని వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్లు ముందుకు వచ్చినట్లు సమాచారం. నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికకి బాపట్ల పట్టణలంఓ రోడ్లపై నీరు భారీగా చేరింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.