ఉత్త‌రాంధ్ర‌పై తుపాను ప్రభావం.. అప్ర‌మ‌త్తంగా ఉండాలని సిఎం ఆదేశం..

26న ‘గులాబ్‌’ తుఫాన్‌.. నేడు, రేపు భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం

విశాఖపట్నం/అమరావతి (CLiC2NEWS): తుఫాను తీరం దాటాక భారీ వ‌ర్షాల‌కు అస్కారం ఉన్నందున్న తీర ప్రాంతాల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారులుల‌ను ఆదేశించారు. తుపాను ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి ఆరా తీసారు. సిఎం ఆదేశాల మేర‌కు అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయ‌నున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బందిని సిద్ధం చేశౄమ‌ని అధికారులు సిఎంకు వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా.. ఆస్తి.. ప్రాణ న‌ష్టం లేకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు.

నేడు, రేపు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి శుక్రవారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా శుక్రవారం రాత్రి బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి శనివారం మధ్యాహ్ననికి తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటనుంది. ఈ తుఫాన్‌కు పాకిస్తాన్‌ సూచించిన ‘గులాబ్‌’ పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.