ఆకట్టుకుంటున్న కల్కి సినిమా…

కల్కి మూవీ ఎంతో అద్భుతంగా ఉంది అని ప్రచారం రావటంతో సినిమాలంటే నాకు మరీ ఆసక్తి లేకున్నా ఇటీవల మన తెలుగు సినిమాలు ఆస్కార్ అవార్డుల వరకు వెళుతూ కొంతవరకు మన తెలుగు కీర్తి ప్రతిష్టలను చాటుతున్నాయి.అంతే కాకుండా ట్రిపుల్ ఆర్ సినిమా లో సుభాష్ చంద్ర బోస్ రాసిన పాటకు,కీరవాణి తీర్చి దిద్దిన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటంతో నా దృష్టి ఈ మధ్య సినిమాలపై పడింది.

కొండంత ఆశతో కల్కి సినిమా కు వెళ్ళాను.,ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే కేరింతలు ఒకో క్షణం సినిమా సాగుతున్నంత సేపు కొంచం అర్థం చేసుకోవటం నాకు మొదట కష్టమనిపించింది….

కొన్ని వేల సంవత్సరాల తరువాత ఈ భూమి పై నీళ్లు ఇంకిపోయి చెట్లు వాడి పోయి కాలుష్యం తో భూమి వేడెక్కి భూమి ఎడారిగా మారిపోయి. ప్రజలు అల్లాడి పోతుంటే మళ్లీ భగవంతుడు పుట్టాల్సిందే..మనను ఆదుకోవాల్సిందే అని చెప్పిన ఇతి వృత్తం చాలా ఆసక్తిని రేకెత్తించింది.

భూమి పై నెలకొన్న కరువు కాటకాల ప్రభావం అంతమొందించి భూమిపై పచ్చని చెట్లు స్వచ్చమయిన ప్రకృతి ని పునరుద్ధరించేందుకు భగవంతుడు పదవ అవతారంగా కల్కి గా అవతరించాల్సిందే అన్నది సినిమా సారాంశం..సినిమాను ఎంతో కష్టపడి ఓవర్ గ్రాఫిక్స్ వినియోగించి… రోబోటిక్ ఎట్రాక్షన్ తో తెరకు ఎక్కించిన విధానం నేటి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.

నేటి తరాలకు భవిష్య త్తులో వచ్చే ముప్పును కళ్ళకు కట్టినట్లు చూపించారు. వీటిని అర్థం చేసుకుంటే ఇక ఇప్పటినుంచైనా కనీసం చెట్లను, చెరువులను రక్షించాలనే ఆలోచన కలుగుతుంది. బహుశా కనిపించనిదేవుడి కోసం ఎదురు చూసే బదులు మనకు ఎదురుగా కనిపిస్తోన్న ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఆలోచన కొందరిలో నైన కలుగుతుంది.

మొత్తం మీద సినిమా మొదటి భాగం కొద్దిగా బోర్ అనిపించినా సినిమా రెండో భాగం ఆసక్తిని రేపింది.ఈ లోపే సినిమా అయిపోవటం కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. మళ్లీ రెండో భాగం ఉందని తెలిసి కొంత సంతోషం కలిగింది..మొత్తంమీద పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.,పిల్లలకు నీళ్లు,గాలి విలువ కొంచెమైనా అ ర్థం అవుతుంది. కొంత చర్చ కూడా జరుగుతుంది…

కొస మెరుపు ఏమిటంటే సినిమాలో complex అనే పదం వుంది , హీరో complex లోకి వెళ్ళే ప్రయత్నం,complex మొత్తం రిచెస్ట్ పీపుల్ మాత్రమే వుండటం.. అక్కడ మాత్రమే చక్కటి వాతావరణం ప్రకృతి అందం వుంటుంది.అని చెప్పటంతో కాసుల విలువ,కాలం విలువ,మనుషుల విలువ గురించి దర్శకుడు నాగ్ అ శ్విన్ చెప్పకనే చెప్పారు. మొత్తమ్మీద హాలీవుడ్ సినిమాకు సరి జోడుగా సినిమా తీయడం అభినందించాల్సిన విషయం.తెలుగు సినిమా కు జేజేలు పలకాల్సిన సమయం.

-ఎస్.వి.రమణా చార్య

Leave A Reply

Your email address will not be published.