8 మంది ఐఎఎస్‌లకు 2 వారాల పాటు జైలు శిక్ష..!

అమరావతి (CLiC2NEWS): కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది ఐఎఎస్‌లకు హైకోర్టు శిక్ష విధించింది. విజయ్ కుమార్, వ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేపు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్ కు రెరండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఎనిమిది మంది హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన ఉన్నతన్యాయస్థానం జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలోనెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని స్పష్టం చేసింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. దీంతో పాటు ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.