డ్ర‌గ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం.. హైద‌రాబాద్‌లో రూ. 50కోట్ల మాద‌క‌ద్ర‌వ్యాలు స్వాధీనం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలో మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ‌ర‌వాణా పోలీసులు నిఘా పెట్టారు. హైద‌రాబాద్ కేంద్రంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌, సిటి టాస్క్‌ఫోర్స్, రాచ‌కొండ ఎస్ఒటి పోలీసులు నిఘాను పెంచారు. తాజాగా రు. 50కోట్ల విలువ‌గ‌ల డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తున్న ఏడుగురిని డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాద్ద నుండి 25 కిలోల మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు యుపిలోని గోర‌ఖ్‌పూర్‌లో అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు రూ. 60ల‌క్ష‌ల పారిపోతుండ‌గా ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. అంతే కాకుండా మెఫిడ్రిన్ త‌యారుచేసే 2 ల్యాబ్‌ల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు.

అదేవిధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు హెరాయిన్ స‌ర‌ఫ‌రా చేస్తున్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక‌రు అరెస్టు చేయ‌గా.. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం. నిందుతుడి వ‌ద్ద నుండి రూ. 50వేల విలువ‌గ‌ల హెరాయిన్‌ను సీజ్‌చేశారు.

Leave A Reply

Your email address will not be published.