మాదాపూర్‌లో బైక్‌ను ఢీకొట్టి సెల్లార్లోకి దూసుకెళ్లిన కారు..

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో సాయినగర్‌లో బైక్‌ను ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు రోడ్డు పక్కన ఉన్న ఓ అపార్టుమెంటు సెల్లార్లోకి దూసుకెళ్లింది. ఈ ఇవాళ తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ సాయి కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.