రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో రూ. 2.2 కోట్ల చోరీ.. కేసును గంట‌ల వ్య‌వ‌ధిలో ఛేదించిన పోలీసులు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (CLiC2NEWS): హెచ్‌డిఎఫ్ సి బ్యాంకు కు చెంది. రూ. 2.2 కోట్ల చోరీ కేసు నిందితుల‌ను ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎస్పీ న‌ర్హింహ కిషోర్ మీడియాకు వెల్ల‌డించారు. హెచ్‌డిఎఫ్ సి ఎటిఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ త‌ర‌ఫున అశోక్ పక్కా ప్ర‌ణాళిక‌తోనే డ‌బ్బుల‌ను ఎత్తెకెళ్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. అనంత‌రం బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది క‌ల్లు గ‌ప్పి ప‌రారైన‌ట్లు తెలిపారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే 5 ప్రత్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసి గంట‌ల వ్య‌వ‌ధిలో కేసును ఛేదించిన‌ట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలు, సిసి కెమెరాల ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకుకున్న‌ట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుడు మాచ‌ర‌మెట్ల‌కు చెందిన వాసం శెట్టి అశోక్ కుమార్ (27) గా గుర్తించారు. అశోక్ డిగ్రీ చేసి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఎటిఎంల‌లో న‌గ‌దు నింపే హెచ్‌టిసి అనే ప్ర‌వేటు ఏజెన్సీ సంస్థ‌లో ఉద్యోగిగా ప‌నిచేస్తున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని హెచ్‌డిఎఫ్ సి బ్యాంకు కు సంబంధించిన 11 ఎటిఎంల‌ల‌లో న‌గ‌దు నింపేందుకు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం రూ. 2,20,50,000 చెక్కును దాన‌వాయి పేట హెచ్‌డిఎఫ్ సి శాఖ‌కు వెళ్లి న‌గ‌దుగా మార్చాడు. అ సొమ్ము ఇనుప పెట్టెలో స‌ర్దుకుని వ్య‌క్తిగ‌త కారులో ప‌రార‌య్యాడు. పోలీసులు అత‌డి సెల్‌ఫోనును ట్రాక్ చేసి ప‌ట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.