ప్రాణాపాయం నుండి బయటపడిన భారత విద్యార్థి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Indian-student-struck-by-lightning-in-America.jpg)
హ్యూస్టన్ (CLiC2NEWS): యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజి మాస్టర్స్ చేస్తున్న సుశ్రూణ్య కోడూరు ఇటీవల పిడుగుపాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడిందని.. వెంటిలేటర్ సదుపాయం తొలగించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఆమె కోమా నుంచి బయటపడిందని, వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోగలుగుతుందని వెల్లడించారు. సుశ్రూణ్య జులై మొదటివారంలో పార్క్‌లోని కొలను వద్ద నడుస్తుండగా.. పిడుగుపాటుకు గురైంది. ఆమె గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు సుదీర్ఘకాలం చికిత్స అందించాలని.. దానికయ్యే ఖర్చుకోసం సహాయం కోరుతూ ఆన్‌లైన్‌లో గోఫండ్‌మి ఏర్పాటు చేశారు.