రేపే నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం..

ప్రారంభోత్స‌వానికి స‌ర్వం సిద్దం.. 

ఢిల్లీ (CLiC2NEWS): మే 28వ తేదీ నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ వేడుక‌కు ప్ర‌ధాన మంత్రి మోడీ, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్ల అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ముందుగా వేకువ‌జామునే పాత పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద పూజ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతారు. అనంత‌రం లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఛాంబ‌ర్ల‌ను సంద‌ర్శిస్తారు. స్పీక‌ర్ ఛైర్ ప్ర‌క్క‌న రాజ‌దండాన్ని ప్ర‌తిష్టించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ, స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ హ‌రివంశ్ స‌హా ప‌లువురు మంత్రులు.. త‌మిళ‌నాడు నుండి వ‌చ్చే పూజారుల‌తో పాటు సెంగోల్ రూప‌క‌ర్త‌లు హాజ‌రుకానున్నారు. అనంత‌రం నూత‌న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు.

మ‌ధ్యాహ్నం నుండి రెండో ద‌శ ప్రారంభ వేడుక‌లు జ‌రుగుతాయి. జాతీయ గీతాలాప‌న‌తో మొద‌లుకానుంది. లోక్‌స‌భ ఛాంబ‌ర్‌లో రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ హరివంశ్ ప్ర‌సంగం అనంత‌రం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము , ఉప రాష్ట్రప‌తి ధ‌న్‌ఖ‌డ్ ప్ర‌సంగం ఉంటుంది. త‌ర్వాత పార్ల‌మెంట్ నిర్మాణం స‌మ‌యంలోని అనేక ఘట్టాల‌తో రూపొందిన వీడియోల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంది. లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌సంగం అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం ఉంటుంది.

పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా రేపు రూ. 75 స్మార‌క నాణెంను విడుద‌ల చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.