న్యాయవ్యవస్థ ఒక్కరి ప్రయోజనాలకోసం పనిచేయదు: సిజెఐ ఎన్వి రమణ
తెలంగాణలో జిల్లా కోర్టుల ప్రారంభోత్సవం
హైదరాబాద్ (CLiC2NEWS): ఎనిమిదేళ్ల క్రితం ఎన్నో సందేహలు, ఎన్నో చర్చల మధ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి ఎన్వి రమణ పాల్గొన్నారు. హైకోర్టు ప్రాంగణం నుండి 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకున్న అనేక మంది ఉద్యమకారులు, మేధావులు, ప్రత్యేకించి న్యాయవాద మిత్రులకు అభినందనలు తెలిపారు.
ఎనిమిదేళ్ల క్రితం ఎన్నో సందేహాలు, ఎన్నో చర్చల మధ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, ఈ ఎనిమిదేళ్ల అనుభవం ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిందని గుర్తు చేశారు.
తెలుగులో మాట్లాడాలని నిర్ణయించుకున్నా..
తెలుగు భాషను గౌరవించి, తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన ఈ నేలపై ఈరోజు తెలుగో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని ఎన్వి రమణ అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని భావించి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రజలకు చేరువగా న్యాయవ్యవస్థ ఉండాలని రాజ్యాంగం సూచించిన విధానాన్ని అమలు చేస్తూ.. ఇవాళ 32 జిల్లాల న్యాయసమాహారాన్ని ప్రారంభించుకున్నాం అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు.
న్యాయ వ్యవస్థలో అతి పెద్ద సంస్కరణ
దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యయనానికి తెర తీసిందని ఆయన అన్నారు. సాధారణ పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణకు తొలి అడుగు వేసింది. ఈ మహత్తర కార్యానికి తెలుగు నేల వేదిక కావడం.. ఒక తెలుగు వాడిగా ఎంతో గర్వపడుతున్నానని ఎన్వి రమణ అన్నారు. నేటితో 13 జ్యడిషియల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషియల్ యూనిట్లుగా మారనున్నాయన్నారు. దేశంలో ఇంత భారీ స్థాయిలో న్యాయ వ్యవస్థ వికేంద్రీ కరణ జరగడం ఇదే తొలిసారి అన్నారు.
న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి సూచనలు చేస్తున్నా, ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతున్నారని అన్నారు. ఉన్నత స్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసం పనచేయదని జస్టిస్ ఎన్విరమణ పేర్కొన్నారు. ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్తకు ముఖ్యం పరిధి దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవు, పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు.
I do consider all the ideas you have introduced
in your post. They are very convincing and will deftinitely work.
Nonetheless, the posts are too brief for newbies. May you please exend them a little from subsequent
time? Thank you for the post.
What’s up, constantly i used to check website posts here
early in the break of day, as i like to find out more
and more.
Informative article, exactly what I wanted to find.