సమతామూర్తి ప్రతిమతో పోస్టల్ కవర్ ఆవిష్కరణ

హైదరాబాద్ (CLiC2NEWS): ముచ్చింతల్‌లోని సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభమయిన నేపథ్యంలో ‘స్టాట్యు ఆఫ్ ఈక్విటి’ పేరిట పోస్టల్ కవర్ విడుదల చేశారు. రామానుజాచార్యుల ప్రతిమతో కూడిన ఈ పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మైం హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభంమైన విషయం తెలిసినదే. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 14వరకు జరగనున్నాయి.
ముచ్చింతల్‌లో మొదలైన ఆధ్యాత్మిక సందడి..