శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన మంత్రి కెటిఆర్
దిలావర్‌పూర్ (CLiC2NEWS): రూ.714 కోట్లతో నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహిస్వామి ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు కెటిఆర్ , ఇంద్రకరుణారెడ్డి ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి నంబర్ 27 ( శ్రీలక్ష్మీ నరసింహిస్వామి ఎత్తిపోతల పథకం) ద్వారా నిర్మల్ నియోజక వర్గంలోని సుమారు 99 గ్రామాలకు నీరు అందనుంది. 20 సంవత్సరాలుగా ఒకే పంటకు పరిమితమైన ఈ ప్రాంతాలు ఇకనుండి మూడు పంటలతో కళకళలాడనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.