రూ.70లక్షల లంచం డిమాండ్ కేసు.. సిబిఐ అదుపులో ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ లావిడియా రూ.70లక్షలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ముంబయిలోని ఓ మధ్యవర్తి ద్వారా రూ. 70లక్షలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు అదుపులోకీ తీసుకొని విచారించగా.. మొత్తం వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
ముంబయి, హైదరాబాద్ , ఖమ్మం, విశాఖపట్టణం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సోదాలు జరపగా.. రూ. 70లక్షలుతో పాటు మరో రూ. 69 లక్షలు, కీలక పత్రాలను లభ్యమయ్యాయి. వాటిని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జీవన్‌లాల్ లావిడియాతో పాటు సాయిరామ్ పలిశెట్టి, నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్, కాంతిలాల్ మెమతా, సజిదా మజహర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.