తెలంగాణ‌లో క‌రెంట్ ఛార్జీలు పెంపు?

గృహ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌పై యూనిట్‌కు 50పైస‌లు అధ‌నం

హైద‌రాబాద్ (CLiC2NEWS)‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రెంట్ ఛార్జీలు పెర‌గ‌నున్న‌వి. ఇంటికి వాడే క‌రెంటుపై యూనిట్‌కు 50 పైస‌లు చొప్పున పెర‌గ‌నున్న‌వి. ఇత‌ర క‌నెక్ష‌న్ల‌కు యూనిట్‌కు రూపాయి చొప్పున అద‌నంగా ఛార్జీ వ‌సూలు చేయ‌నున్నారు. ఈమేర‌కు రాష్ట్ర విద్యుత్‌ నియంత్ర‌ణ మండ‌లి (ఇఆర్‌సి ) ఛైర్మ‌న్ శ్రీ‌రంగారావు, విద్యుత్ పంపిణి సంస్థ‌ల‌ సిఎండిలు ర‌ఘుమారెడ్డి, ఎ. గోపాల‌రావు మీడియా స‌మావేశంలో ప్ర‌తిపాద‌న‌ల వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చే ఏప్రిల్ 1వ తేదీనుండి అమ‌లులోకి రానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.