పిఎంఎంవై పథకం రుణ పరిమితి రూ. 20 లక్షలకు పెంపు

ఢిల్లీ (CLiC2NEWS): సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలను అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై). 2015లో కేంద్రం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకం రుణ పరిమితిని కేంద్రం పెంచింది. ఈ పథకంలో మూడు రకాల రుణాలు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50వేల వరకు, కిశోర రుణాల కింద రూ.50 వేల నుండి రూ.5లక్షల వరకు, తరుణ్ రుణాల కింద రూ.5-10 లక్షల మేర ఆర్ధిక సహాయం అందిస్తారు. అయితే తరుణ్ప్లస్ పేరిత కొత్త కేటగిరిని తీసుకొచ్చారు. దీనికి రుణ పరిమితి రూ. 10లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు. ఇంతకు ముందు రుణాలు పొంది తిరిగి వాటిని చెల్లించిన వారికి మాత్రమే ఈ రుణాలు అందుతాయని స్ఫష్టం చేశారు. ఈ పథకానికి రుణ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఇదివరకే ప్రకటించారు.