ఎపిలో అర్చ‌కుల క‌నీస వేత‌నం పెంపు: మంత్రి ఆనం రామనారాయ‌ణ‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర్చ‌కుల క‌నీస వేత‌నాల‌ను పెంచుతున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. రూ.50వేల ఆదాయం దాటిన దేవాల‌యాల్లో ప‌నిచేసే అర్చ‌కుల వేత‌నాలు పెంచుతున్న‌ట్లు స‌మాచారం. వారికి రూ.15వేల క‌నీస వేత‌నం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచించిన‌ట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ10 కోట్ల మేర అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని, 3,203 మంది అర్చ‌కుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. వేద పండితుల‌కు , వేద విద్యార్థుల‌కు నిరుద్యోగ భృతి ద్వారా ల‌బ్ధి క‌లుగుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.