రాష్ట్రంలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ సీట్ల పెంపు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ సీట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంజినీరింగ్‌లో 14,565 సీట్లు.. పాలిటెక్నిక్ కాలేజీల్లో మరో 1,170 సీట్లు పెరగనున్నాయి. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిచ్చినట్లు గురువారం ప్రకటనలో తెలిపారు. దీంతో పాలీసెట్ తుది విడ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది.
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 86,103 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. తాజాగా మరో 14,656 సీట్లు పెంపుకు అనుమతి లభించింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులు చేసినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కొత్త సీట్లకు అనుమతి కారణంగా.. శుక్రవారం, శనివారం ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 9వ తేదీన ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అలాగే వెబ్ ఆప్షన్‌ల గడువు 12 వ తేదీ వరకు పొడిగించారు. ఈ నెల 16న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. 24 నుండి రెండో విడత.. ఆగస్లు 4 నుండి తుది విడ కౌన్సెలింగ్ ఉంటుందని సమాచారం.