ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు: సిఎం చంద్రబాబు
అమరావతి (CLiC2NEWS): ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీని రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశంలోనే ఉత్తమ క్రీడా విధానంగా ఎపి నూతన పాలసి ఉండాలని..
స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సిఎం ఆమోదం తెలిపారు. ఒలింపిక్స్ , ఆసియా గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలను భారీ పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే.. రూ. 75 లక్షల నుండి రూ.7కోట్లకు పెంచాలని, ఆసియా గేమ్స్ పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్‌కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్‌లో పసిడి విజేతలకు రూ.10లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5లక్షలు , కాంస్య పతక విజేతలకు రూ.3లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదన చేశారు.