ఎపిలో సినిమా టికెట్ల ధరల పెంపు..
అమరావతి (CLiC2NEWS): సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి ధరలను పెంచింది. టికెట్ల రేట్లు కినిష్టంగా రూ. 20, గరిష్టంగా 250 గా నిర్ణయించింది, ఈ రేట్లకు జీఎస్టీ అదనం, హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ. 100కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కనీసం పది రోజులు రేట్లు పెంచుకునేల అవకాశం ఇచ్చింది. అయితే, 20% షూటింగ్ ఎపిలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తాజా ఉత్వర్వుల్లో పేర్కొంది.
కార్పోరేషన్లో నాన్ ఎసి థియేటర్లలో నాన్ ప్రీమియం రూ.40, ప్రీమియం రూ. 60, ఎసి థియేటర్లలో నాన్ ప్రీమియం రూ. 70 , ప్రీమియం రూ. 100, స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం రూ. 100, ప్రీమియం రూ. 125, మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ సీట్లకు రూ. 150, కెక్లయినర్ సీట్‌కు రూ. 250 లుగా ధరలను నిర్ణయించింది.