పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

ఢిల్లీ (CLiC2NEWS): గృహావసరాలకు వినియేగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. దేశవ్యాప్తంగా 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ పై రూ.50 చొప్పున కేంద్రం పెంచింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువల శాఖమంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు. గత వారంలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధరను రూ.41మేర తగ్గించింది. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం నుండి అమలులోకి రానున్నాయి.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం పెరిగిన గ్యాస్ ధరలు వర్తిస్తాయి. సాదారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులు సిలిండర్ ధర కు అదనంగా రూ.50చెల్లించాల్సి ఉంది.