IND vs AUS: మూడో వన్డేలో ఆసీస్ విజయం

రాజ్‌కోట్ (CLiC2NEWS): మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. 66 పరుగుల తేడాతో కంగారులు విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అస్ట్రేలియా జట్టు 352 పరుగులు చేసింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటయింది. భారత్ మొదటి రెండు వన్డేలను కైవసం చేసుకుని 2-1 తేడాతో సిరస్‌ను దక్కించుకుంది.