బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: నాలుగో టెస్ట్ మ్యాచ్.. ఆసీస్ 480/10

అహ్మదాబాద్ (CLiC2NEWS): భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటయింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ గురువారం ప్రారంభించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇక రెండో రోజు 10 వికెట్ల నష్టానికి 480 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో రాణించారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి 36 పరుగులు చేశారు.