తొలి ఇన్నింగ్స్లో భారత్ 233 పరుగుల ఆధిక్యం
నాగ్పూర్ (CLiC2NEWS): భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మూడో రోజుకొనసాగుతుంది. టీమ్ ఇండియా 400 పరుగులు చేసి 233 పరుగుల ఆధిక్యంతో ఆలౌటయింది. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ అత్యధికంగా 7 వికెట్లు తీశాడు. అశ్విన్, పుజారా, కోహ్లీ జడేజా, శ్రీకర్ భరత్, షమి.. మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ (120) సెంచరీ చేయగా.. జడేజా 70, అక్షర్ 84 పరుగులు సాధించారు.
తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 177 పరుగులకు ఆలౌటయింది. రెండో రోజు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 400 పరుగులు సాధించింది