టి 20 సిరీస్ భారత్ కైవసం..

రాయ్‌పుర్ (CLiC2NEWS): వన్డే ప్రపంచకప్ చేజారిన టీమిండియాకు కాస్త ఊరట లభించింది. పొట్టి ఫార్మాట్ టి20లో భారత్ కాంగారులపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టి 20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాల్గవ టి20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టును భారత్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయానికి కారకుడయ్యాడు.