IND vs AUS: తొలి టెస్ట్‌లో ఆసీస్‌పై భారత్ ఘన విజయం

నాగ్‌పూర్ (CLiC2NEWS): బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భారత్, ఆస్ట్రేలియాపై 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సొంతం చేసుకుంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 91 పరుగులకే ఆలౌటయింది. ఈ మ్యాచ్‌లో భారత్ స్పిన్ర్లు 16 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 3 42.. రెండ్ఓ ఇన్నింగ్స్‌లో 5 37.. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 5 47 రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. దీంతో టీమ్ ఇండియా 233 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారుల జట్లు 91 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో భారత్ 132 పరుగుల ఆధిక్యంతో విజయం సొంతం చేసుకుంది.