నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా.. 2-1 తేడాతో సిరీస్ భార‌త్ కైవ‌సం

అహ్మ‌దాబాద్‌ (CLiC2NEWS): బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో భార‌త్ 2-1 తేడాతో ట్రోఫీని గెలుచుకుంది. టీమ్ ఇండియా డ‌బ్ల్యుటిసి ఫైన‌ల్‌కు చేరుకుంది. తొలి రెండు టెస్టుల్లో టీమ్ ఇండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక మూడో టెస్ట్ ఆసీస్ సొంతం చేసుకుంది. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 ప‌రుగులు చేసింది. భార‌త్ 571 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. ఆస్ట్రేలియా రెండ‌వ ఇన్నింగ్స్ ప్రారంభించి 2 వికెట్లు న‌ష్ట‌పోయి 175 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌ను ఆల్‌రౌండ‌ర్స్ ర‌విచ‌రంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. నాలుగో టెస్టు ఫ‌లితం తేల‌కుండానే.. ఇరు జ‌ట్ల కెప్టెన్లు నిర్ణ‌యించి, మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

Leave A Reply

Your email address will not be published.